Saturday, June 6, 2009

చేదు ఉప్పెన రేపిన నిప్పుల కెరటాలు మదిని కాల్చిన వేళ ....
మత్తు రేపే మల్లెలయిన , మగువ చూపుల కత్తులయినా ....
మగ మనిషిని మరణం లేని శిలగా మార్చును .............
భయం తో అడుగేసే చోట పాదం వణుకుతుంది ....
ధైర్యంగా పాదం పడిన చోట ప్రపంచం వణుకుతుంది...

Monday, February 23, 2009

నీ అధరాల పై చిరు దరహాసం లా అరక్షణం జీవించినా అది అమరత్వమే కదా !!
నీ సిరిమువ్వల షబ్ద తరంగాలను మోసే గాలినయి గతించినా మహద్బగ్యమే కదా !!
నీ స్వేధ బిందువుల్లొ ధూళి రేణువునయినా కాక పోతిని నీ స్పర్షను పొందగ !!!
నిన్ను వలచని వ్యక్తి వ్యర్థము ..నువ్వు వలచిన వాడి జన్మ ధన్యము !!!!!!

Friday, February 13, 2009

మతం మత్తులో చిత్తుగా మునిగిన ఆ తొత్తులా !!!
నాకు హితులు చెప్పేది ???
మతిలేని మతాన్ని ఎవరిచ్చారు ఆ సుతులకి ???
ఆ దేవుడా ???
జీవనగమనం లో అలనాడు ఓడిన ఈ జీవుడా ???
ఆ గతిలేని మతానికి నా మది లో చోటు లేదు ....
మనిషితనమే నా మతం ...
పరుల సౌఖ్ఖ్యమే నా కులం ...

Sunday, February 8, 2009

కాళ రాత్రిని చీల్చు ఆ భానుడొంటరి
పండు వెన్నెల నిచ్చు చంద్రుండు ఒంటరి
ప్రాణ నాడులు నింపు ఆ వాయువొంటరి
ఈ నేల ఒంటరి ఆ నింగి ఒంటరి
పంచ భూతాలకే లేని తోడు నాకేల
పడతి సహచర్యం పదును మనకేల
;)

Wednesday, January 28, 2009

స్పందించే ప్రతీ స్పందన నీకోసం ...
భాదించే ప్రతిస్పందన నా సొంతం

వలచి విడిచావు ...
తలచి రగిలాను ...

మార్పు కావాలన్నావు ...
మారలేనని అన్నాను ...
మరలి రానని అన్నావు ...
మార్పు వలదనుకున్నాను ...

Thursday, January 22, 2009

గతించిన గతాన్ని తలచి భాధపడేవాడు .......
భవిష్యత్తును చూచి భయపడేవాడు ....
జీవితం లో ఏది సాధించలేడు .....
గత అనుభవాలనే ఆయుధాలని పూని భవిష్యత్తనే
యుద్ధరంగం లోకి ప్రవేశించిన వాడు పొందే విజయాన్ని
ఎవ్వడూ ఆపలేడు ...........
Mr.నిర్వేదం ........