Wednesday, January 28, 2009

స్పందించే ప్రతీ స్పందన నీకోసం ...
భాదించే ప్రతిస్పందన నా సొంతం

వలచి విడిచావు ...
తలచి రగిలాను ...

మార్పు కావాలన్నావు ...
మారలేనని అన్నాను ...
మరలి రానని అన్నావు ...
మార్పు వలదనుకున్నాను ...

Thursday, January 22, 2009

గతించిన గతాన్ని తలచి భాధపడేవాడు .......
భవిష్యత్తును చూచి భయపడేవాడు ....
జీవితం లో ఏది సాధించలేడు .....
గత అనుభవాలనే ఆయుధాలని పూని భవిష్యత్తనే
యుద్ధరంగం లోకి ప్రవేశించిన వాడు పొందే విజయాన్ని
ఎవ్వడూ ఆపలేడు ...........
Mr.నిర్వేదం ........
ఏముంది సాధించేది బ్రతికి ...
ఏముంది కోల్పోయేది చచ్చ్చి...
బ్రతుకే భారమయినపుడు భంధం కంట పడదు ...
భంధం భారమయినపుడు మనుగడ సాధ్య పడదు .........
Mr.నిర్వేదం ........
మనో ఫలకం పై ఉలి తో లిఖించాను మన స్నేహాన్ని
ఓ స్నేహమా తనువు నశించు గాక ......
నా మనస్సుకి మరణం లేదు ...
మన స్నేహం అమరమయినది ....
-Mr.నిర్వేదం............

ఆ వేదన నాకు తెలుసు ....

ఆ వేదన నాకు తెలుసు ....

నీ ఆవేదన ఫలితమే నా ఈ రూపం అనీ నాకు తెలుసు ....
నీ ప్రసవ వేదం నుండి జనించినదే నా తొలిశబ్ద నాదం అనీ నాకు తెలుసు ....
నా ఉదర భాధని ఓదార్చిన నీ క్షీరమే నా ఈ దేహం అనీ నాకు తెలుసు ....

నడక నేర్చే వయస్సులో తగిలిన ప్రతి దెబ్బకీ నీ ప్రేమామ్రుతాన్ని పూసావు ....
నీ గోరు ముద్దల జ్ఞానం తో నాలో లోక జ్ఞానం పెంచావు
ఎన్నో చేసావు ..ఎన్నెన్నో కష్టాల కోర్చి నన్నింత వాన్ని చేసావు ..

ఎలా తీర్చుకోనమ్మా నీ ఋణం .....
నా నయనాశృవులతో నీ పాదాలని అభిషేకం చెయ్యటం తప్ప...
చేతగాని స్తితిలో ఉన్నాను ...
మన్నించమ్మా... మన్నించు ..........