Thursday, April 21, 2011

పొందేది ఏదైతేనేం ?? పోయినది తిరిగొచ్చేనా ??
కలలన్ని కదలు కదలుగా మది గది లో మధుర స్మృతులుగా మిగిలేను
అది తలచి తలచి యెద రగిలేను .....

Friday, April 1, 2011

ఆ జ్ఞాపకాల సాయంత్రం (3/7/2011)

ప్రపంచానికి దూరంగా ఉన్నాను మధ్యాహ్నం నుండి :) అంటే ఏ చంద్ర మండలం పైనకో వెళ్ళానని కాదు , internet రావడం లేదు మధ్యాన్నం నుండి, ఇంకా cell phone switch off చేసేసాను

కావలసినంత ఒంటరితనం గది నిండా , మనస్సు నిండా , ఎప్పుడూ లేని నిశ్షబ్దం , మద్య మద్య లో ఆ నిశ్షబ్ధాన్ని భంగపరుస్తూ రెండు దోమలు వాటి భాషలో ఎదో మాట్లాడుకుంటున్నాయి చాలా కాలానికి నాకు నేను దొరికాను , నాతో నేను మాట్లాడుకుని ఎంతకాలం అయింది .
అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఉండేవాన్ని ,నాకోసం ఆగకుండా కాలం మరింత వేగం తో పరుగులు తీస్తూనే ఉంది , ఎందుకో మరి దానికి ఆ తొందర ఎవరిని చేరుకోవాలనో దాని ఆత్రుత ......

4 సంవత్సరాలుగా ఒంటరిగా బ్రతుకుతున్నాను ... ఎందుకో నన్ను ఎక్కువ కాలం దగ్గరనుండి భరించలేరు జీవులు ,కొత్తలో పరిచయమయిన వారంతా బాగానే ఉంటారు ,అదేదో నేను పుట్టినప్పటినుండి వాళ్ళతోనే ఉన్నట్టు ,గత జన్మలో మేమేదో ఆత్మీయులమయినట్టు , మాది జన్మ జన్మల భందమయినట్టు మాట్లాడతారు :) . నాకు భాధ కలిగితే వాళ్ళు ఏడుస్తారు ,నేను ఆనందంగా ఉంటే నా ఆనందమే వాళ్ళ జీవితాశయం అన్నట్టు మురిసిపోతారు .
కొంతకాలం గడిచేసరికి నన్నొక వింత జంతువులా చూస్తారు :) నేను పరిచయం అవ్వడం వాళ్ళు పోయిన జన్మలో చేసుకున్న పాపం లా భావిస్తారు , నేను భాదపడితే చేసిన ఖర్మానికి ఫలితం అనుభవిస్తున్నాడు అంటారు , నేను ఆనందం లో ఉంటే వాళ్ళ ఆస్తులేవో పోయినట్టు తెగ గాభరా పడిపోతారు , ఎందుకో మరి ,దాదాపు అందరు ఇంతే .
నేను పుట్టి 23 సంవత్సరాలు అయింది ,ఒక్క ప్రాణ మిత్రుడూ లేడు , ఉన్న వాల్ళ్ళకి కొద్ది కాలనికే నేను అంటే విసుగు ఒచ్చేసింది , నాతో స్నేహం చేసే అర్హత ఎవ్వరికి లేదా ? లేక ఆస్నేహాన్ని పొందే అర్హత నాకు లేదా ?? ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ...
టైం 6:45 కావస్తుంది మెల్లిగా గదిని చీకటి ఆక్రమిస్తుంది , ఎందుకో నా మొదటి ప్రేయసి కళ్ళముందర కదలాడింది ,తన జ్ఞాపకాలు తెరలు తెరలుగా కళ్ళ ముందు కదలాడాయి :) ,ఇంకా ఎక్కడో తనంటే జాలి ఉంది కాబోలు నా మనస్సు లోతుల్లో ..... ఓ కన్నీటి చుక్క రాలి పుస్తకం పై పడింది ,తన గురించి చెడ్డగా మాట్లాడ్డం ఇష్టం లేదు ... బలవంతం గా తన జ్ఞాపకాలను పక్కకి నెట్టెస్తే నా బంగారం కనపడింది <3 కొన్ని నెలలుగా తనే లోఖం గా బ్రతికాను ,తనతో మాట్లాడటానికి చెయ్యని పిచ్చి పనంటూ లేదు , ఒకసారైతే తను వెళ్తున్న ట్రైన్ లో వెళితే 5 నిముషాలన్నా మాట్లాడకపోతుందా బంగారం అని , టైం కి డబ్బులు లేకపోతే general ticket కొనుక్కుని మరీ హైదరాబాదు నుండి చెన్నయ్ దాకా నిలుచుని ప్రయాణం చేసాను , ఇలాంటి టింగరి వేషాలు చాలానే వేసాను తన కోసం హహహహా , తనకి కూడా నే అంటే ఇస్టమే కానీ ఊహించని ( నా ఊహకు అందని ) ఎన్నో పరమ దరిద్రపు పరిస్తితులను ఎదుర్కుని మరీ తనని గెల్చుకున్నాను (ఆ జ్ఞాపకాలను పదిలం గా నాలోనే శిథిళం చేసెసేసాను )

అమ్మా నాన్నా ఎందుకో నా వెనకాలే కూర్చుని నాకేసి చూస్తున్నట్టనిపించింది :) అమ్మ కళ్ళళ్ళో నేను టైం కి తింటున్ననో లేదో , కంటి నిండా పడుకుంటున్ననో లేదో అన్న ఆత్రుత తప్ప వేరే ఎదీ కనిపించలేదు నాన్న చూపులో నేను ఏదో ఒక రోజు తప్పకుండా గొప్పవాన్ని అవుతాను అన్న నమ్మకం కనిపించింది .
కళ్ళనుండి కన్నీరు ధారగా కారడం మొదలయింది , దూరంగా గదిలో చీకట్లో కలిసిపోతున్న jhones గాడి ఫొటో పైకి నా చూపు వెళ్ళింది నా నాలుగు సంవత్సరాల ఒంటరితనం లో వీడు రెండు సంవత్సరాలు నాతోనే ఉన్నాడు ,తోక ఊపుతూ నాకుతూ నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు వెధవ .
నిజానికి నా స్వార్థానికి వాడి జీవితం తో ఆడుకున్నాను , ఒక సమయం లో మనుషుల పైన విరక్తి పుట్టింది , చిన్నప్పటినుండీ ఉన్న జంతు ప్రేమ అంతరాత్మని వెళ్ళి ఒక కుక్కని తెచ్చుకో నీ ఒంటరితనం పోతుందీ అని దొబ్బితే రకరకాల ప్రదేశాలు వెతికి హిమాయత్ నగర్ లో వీడిని కొన్నాను ,కొనడానికి ముందే వీడికి Dr.jhons అనే పేరు పెట్టాను .
కొనేప్పుడు jhons గాడు వాడి ఇద్దరు తమ్ముళ్ళు ,ఒక చెల్లితో హాయిగా నిద్రపోతున్నాడు దూరంగా వాళ్ళమ్మ పడుకుని దీనంగా నన్నే చూస్తుంది ..... అమ్మేవాడికి డబ్బులిచ్చి చిన్నారి jones గాడిని తీసుకొస్తుంటే చుట్టూ ఉన్న బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు ఏడుస్తున్నట్టు అరిచాయి వాటి స్నేహానికి ఆరోజుకి 32 రోజులు మరి ... నేను jhons గాడిని తీసుకుని వెల్తుంటే వాడి అమ్మ భాదతో చూసిన ఆ చూపు తన బిడ్డని ఇంకొకళ్ళు తీసుకెళుతుంటే చేతగాని స్తితి లో ఉన్న ఆ కళ్ళళ్ళో భాధని చూసి ఒక్కసారి ఆగిపోయాను వదిలేసి వెళదామా అని , కానీ ఇంటికొస్తే గది నలుమూలల్లో దాక్కుని నన్ను భయపెట్టే ఒంటరితనం గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూడకుండా గాడిని తీసుకుని ఇంటికొచ్చేసాను ....

మొదట్లో వాడు కొంచం భయపడ్డా తర్వాత బుల్లి బుల్లి ఆడుగులతో నా వెంట తిరుగుతూ వచ్చీ రాని భౌ భౌ (కుయి కుయి ) తో అరుస్తుంటే భలే ముచ్చటేసేది .... నాకంటూ ఒక తోడు దొరికింది అహ దొరకడం కాదు ఒక తోడు ని కొనుక్కున్నాను అంటే సరిపోతుంది ,అది వచ్చిన రోజే ఇద్దరం మందు పార్టీ చేసుకున్నాం ( అంటే దానికి పాలు నాకు మందు అన్నమాట )తాగేసి పడిపోయి ఏరాత్రి కో లేచి చూస్తే అది నాకంటే గాడ నిద్ర లో పాలు పొసిన గిన్నెలోనే తల పెట్టి పడుకునిపోయింది హహ నవ్వొచ్చింది నాకు చాలా :)

ఆరోజు నుండి ప్రతీ విశయాన్నీ తనతో చెప్పుకునేవన్ని (దానికి ఎంతవరకు అర్థమయ్యేదో మరి ) ,నేను బట్టలు కొనుక్కున్నా లేకపొయినా దానికి రకరకాల బట్టలు ప్రతీ పండక్కీ కొని వేసేవాన్ని
అబ్బో ఎన్నో జ్ఞాపకాలు అసలు , ఒక మనిషి ఇవ్వలేని ఆనందాన్ని వాడు నాకిచ్చాడు ,ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం , నాకంటూ ఒక ప్రాణి నా సోది వినడానికి ఒక జీవి ప్రపంచం లో ఉంది అన్న ఆ ఆనందం భలే ఉండేది
కానీ ఈ రోజు వాడు లేడు .... ఎక్కడున్నడో వెధవ అప్పుడప్పుడూ ఇలా గుర్తొచ్చి ఏడిపిస్తూ ఉంటాడు :) పూర్తిగా చీకటయింది రాయడానికి ఎమీ కనబడటం లేదు ఇంక .....
చీకటి తో మాట్లాడి చాలకాలం అయ్యింది ఇప్పుడు ఆ కోరిక కూడా తీర బోతోంది ....

కళ్ళు తుడుచుకుంటూ శశాంక్ :)

Monday, September 6, 2010

రాస్తాను నీకోసం ప్రియతమా ....
రాస్తాను నీకోసం ...
కనురెప్పలు దాటని కన్నీటిని కలం గా మార్చి
కలకాలం కరిగిపోని చెరిగిపోని కవితను
రాస్తాను నీకోసం ప్రియతమా ...

నీవిచ్చిన ఆ ప్రేమను తిరితిరిగి తీసుకుంటావా
ఒంటరిగా నన్ను నువ్వు వదిలివెల్లిపోతావా ..

ఆ ముద్దుల మురిపాలు కౌగిలింతల కలవరింతలు
కలకాలం ఉంటాయని అనుకున్నానే కానీ
చిరుకాలం లోనే చిదిమేస్తున్నావే

మరచిపోను నిన్ను
మరువబోకు నన్ను

నరనరాల్లో నాటుకుపోయిన నీవు
కరిగిపోయే తీయని స్వప్నం కావు

మనసు అణువుల్లో ఒదిగిపోయిన నీవు
మన ప్రేమ భాందవ్యాన్ని వదిలివెల్లి పోవు

నీ మనసుకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించావని
నా మనసుకు అంతా అర్పించావని ...

చేసిన తప్పును మన్నించు
చెంతకు చేరి కరుణించు

Mr.నిర్వేదం.

Sunday, August 29, 2010

విరహం కన్న మరణం మిన్న
ప్రణయం కన్న ప్రళయం మిన్న
తడబాటు చివరి మజిలీ ఎడబాటేనా ...

Mr.నిర్వేదం .

Saturday, July 24, 2010

నాదొక శోఖం నేనొక లోకం
ఆశల మోహం తీరని దాహం
విసిగిన కళ్ళు బిగిసిన పళ్ళు
ప్రేమ నకళ్ళు మనసుల కుళ్ళు
గ్రుహ కలహాలు ప్రియ విరహాలు
వదిలేసాను వదిలేసాను ....
చిరుజల్లుల తొలిస్వచ్చత మధుకలశపు మలయపు మకరంధాన్ని త్రాగేసాను...
పరిపూర్నత సాధించాను .

Tuesday, October 13, 2009

జనిస్తుంది ఒక ఉదయం
జ్వలిస్తుంది ఒక హ్రుదయం

ఆ జననం కాలగమనం
ఈ జ్వలనం రుధిర తర్పణం

ముగుస్తుంది ప్రతి చలనం
మురుస్తుంది విధి నయనం

Tuesday, June 9, 2009

ఎవడిచ్చాడు ఈ దేహాన్ని ... ?
ఎందుకిచ్చాడు దానికొక మనస్సుని ... ?
భవ భాంధవ్యాలు మరిచి భలిసి కొట్టుకోవడానికా ... ?
అనిర్వచనీయమయిన ప్రకృతిని వికృతి గా మార్చి విలాసం చెయ్యడానికా ... ?
ఆ విలాసం వెనుక విషాదం ఉంది ..
ఆ విషాదం చిమ్మే విషం మనస్సుని, శరీరాన్ని దహించక మునుపే మేల్కొంటే
జీవం సార్థకమవుతుంది , జీవి శాశ్వతుదవుతాడు ......