Tuesday, June 9, 2009

ఎవడిచ్చాడు ఈ దేహాన్ని ... ?
ఎందుకిచ్చాడు దానికొక మనస్సుని ... ?
భవ భాంధవ్యాలు మరిచి భలిసి కొట్టుకోవడానికా ... ?
అనిర్వచనీయమయిన ప్రకృతిని వికృతి గా మార్చి విలాసం చెయ్యడానికా ... ?
ఆ విలాసం వెనుక విషాదం ఉంది ..
ఆ విషాదం చిమ్మే విషం మనస్సుని, శరీరాన్ని దహించక మునుపే మేల్కొంటే
జీవం సార్థకమవుతుంది , జీవి శాశ్వతుదవుతాడు ......

Saturday, June 6, 2009

చేదు ఉప్పెన రేపిన నిప్పుల కెరటాలు మదిని కాల్చిన వేళ ....
మత్తు రేపే మల్లెలయిన , మగువ చూపుల కత్తులయినా ....
మగ మనిషిని మరణం లేని శిలగా మార్చును .............
భయం తో అడుగేసే చోట పాదం వణుకుతుంది ....
ధైర్యంగా పాదం పడిన చోట ప్రపంచం వణుకుతుంది...